![]() |
![]() |

ఫామిలీ అసెంబ్లీ లేటెస్ట్ ప్రోమో చూస్తే వామ్మో అనిపించేలా ఉంది. ఇందులో జాఫర్ కి హోస్ట్ రోజాకి మధ్య గట్టిగానే మాటల యుద్ధం జరిగింది. "జట్కాబండి విత్ జాఫర్" అనే కాన్సెప్ట్ ఇందులో బాగా హైలైట్ అయ్యింది. "విష్ణుప్రియ ఇండస్ట్రీలో టాలెంట్ లేకుండా ఎదగాలంటే కొన్ని టిప్స్ చెప్పగలుగుతావా" అని అడిగారు జాఫర్. "ఇండస్ట్రీలో టాలెంట్ లేకుండా" అని విష్ణుప్రియ చెప్పబోతుంటే వెంటనే రోజా వీపు మీద కొట్టి "నీకు టాలెంట్ లేదంటున్నాడే పిచ్చి మొహమా" అన్నారు.
దాంతో అక్కడ ఉన్న అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య, పృథ్వి శెట్టి తెగ నవ్వారు. తర్వాత మళ్ళీ జాఫర్ "శారీలో చాలా నిండుగా ఉన్నావ్ తల్లి ఇలానే ఎందుకు కంటిన్యూ చేయకూడదు ఏమన్నా ఇబ్బందా" అని అడిగారు. వెంటనే రోజా ఆన్సర్ ఇచ్చారు. "ఎం నువ్వు ఆయనకు అన్నవా" అనేసరికి "ఈ కాంట్రోవర్సిలోకి నన్ను లాగొద్దు" అన్నారు జాఫర్. "నువ్వు లాగావ్" అని రోజా సీరియస్ అయ్యారు. "మేడం మీకు చెమటలు పట్టే ప్రశ్న" అన్నారు జాఫర్.
"నా ఆన్సర్ తో నీకు చెమటలు పట్టకూడదు కదా" అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు రోజా. "రాష్ట్ర ప్రజలందరూ మీరేం చెప్తారా అని ఎదురు చూసే ప్రశ్న" అని మళ్ళీ అన్నారు జాఫర్. "నేను నిన్ను కొడతానా లేదా అని ఎదురు చూస్తుంటారు" అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు రోజా. "చాలామంది జడ్జీలతో మీరు షోలు చేసారు" అని జాఫర్ అనేసరికి రోజా కిలకిలా నవ్వేశారు. "చూసారా ఎం అడగబోతున్నానో మీకు అర్ధమయ్యింది." అన్నారు జాఫర్. "నేనే కాదు నువ్వు కాంట్రోవర్సిలో ఇరుక్కుంటావ్ అడుగు" అన్నారు రోజా. "మీ ఫేవరేట్ జడ్జ్ ఎవరు ? అనిల్ రావిపూడినా, మనోనా, మీతో చాలా కాలం జడ్జ్ గా చేసిన వ్యక్తా " అని అడిగారు జాఫర్. "పేరు చెప్పే ధైర్యం నీకు లేనప్పుడు ఆన్సర్ నీకెందుకు" అన్నారు రోజా.
![]() |
![]() |